రామ్ గోపాల్ వర్మ గారి "వెనుక మాట"
ముందుమాట కన్నావెనక మాటకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని నా నమ్మకం. ఎందుకంటే ఒక పని అయ్యిపోయిన తర్వాతా దాని ఫలితాన్ని విశ్లేసించడం వల్లే మనకి దాని పట్ల అవగాహన పెరుగుతుంది. అప్పుడు దాని నుంచి వచ్చిన అనుభవాన్ని స్టడీ చేసి వేరే వాళ్లకి అర్ధమయ్యేతట్టు చెప్పడాన్ని వెనకమాట అంటే బావుంటుంది అనిపించి
ఇక్కడ హెడ్డింగ్ వనక మాట అని పెట్టాను - రామ్
గోపాల్ వర్మ
పుస్తక రచనలో ఉండే ముందుమాట యొక్క అర్ధం ఇదే అని నేను కచ్చితంగా చెప్పలేను కాని నాకు తెలిసినంతవరకు ఆ ముందుమాట యొక్క సారాంశం మనకి ఆ పుస్తకం మీద ఒక అవగాహన కలగచేసే ప్రయత్నమని నేను బావిస్తుంటాను. మనం ఆ పుస్తకం లో ఏవి ఏవి చదవబోతున్నామో ముందుగానే వారు చెబుతున్నారు కాబట్టి, మీకు నా "ముందుమాట" ఇది అని ఆ రచయిత ఉద్దేశం అయ్యివుండవచ్చు.
ఇక్కడ ఈ ముందుమాట, ఆ రచయిత మనకి చెప్పే ముందుమాట అయినప్పటికీ, అందులో ఆ రచయిత తన రచన వెనుక మూల ఉద్దేశం ఇది అంటూ ఆ రచనలో ఆయన పొందుపరిచిన విషయాలు ఇవి అంటూ అయ్యిపోయి ఇప్పుడు మనకి అందిస్తున్న ఆయన రచన గురించి చెబుతున్నారు. కాబట్టి కచ్చితంగా ఇవి ఆ రచయిత రచన యొక్క వెనకమాట మాత్రమే!!.
నాకు తెలిసినంతవరకు, ఒక రచయిత తను ఏమి రాయబోతున్నాడో ముందుగానే తెలిసే ప్రసక్తి లేదు. తను పలాన విషయం,విశేషం, సంఘటన, అనుభవం, అనుభూతి, అభిప్రాయం గురించి రాయాలని మొదలుపెడుతాడే తప్ప అందులో ఎంత రాయబోతున్నాడో ఆయనకి తెలియకపోవచ్చు అని నా అభిప్రాయం. మన రాము గారు పైన చెప్పిన దాని బట్టి నాకు ఏమి అనిపిస్తుంది అంటే, ఆయనకి తోచింది, ఊహించింది, అనిపించింది రాసిన తర్వాత దాన్ని చదివినప్పుడు, విశ్లేసించినప్పుడు ఆయన ఒక అనుభూతికి లోనై ఉంటారు. ఆ అనుభూతిని కలిగించిన తన రాతల వెనక ఉన్న తన చేష్టల గురించి చెప్పి తన రాతలు మనకి అర్ధం అవ్వటానికి వీలుగా ఆయని వెనుకు మాట మనకి ముందుగానే చుబుతున్నారు.
రాముగారు వెనుక మాట గురించి చెప్పింది నాకు ఎంతో అద్బుతంగా అనిపించింది.ఎందుకంటే, ఒక సినిమా తీసిన, ఒక రచన చేసిన అది చుసిన దర్శకుడికి, అది చదివిన రచయితకి కలిగినంత అనుభూతి ఇంకెవ్వరికీ కలుగదు. వారికి కలిగిన అనుభూతికి మూల కారణం వారికి కచితంగా తెలుసు. ఆ సినిమా చూస్తున్న, ఆ కథ చదువుతున్న వారికి కూడా ఇదే రకమైన అనుభూతి కలగాలి అంటే, వారికి ఆ అనుభూతిని కలిగించే మూల కారణాలు పరిచయం చేయాలి. అంటే ఆ ప్రేక్షకుడిని తను చూడబోయే సినిమాకు తగ్గట్టు ప్రిపేర్ చేయాలి. ఈ విధంగా ఒక ప్రేక్షకుడిని ప్రిపేర్ చేయటంలో రామ్ గోపాల్ వర్మ గారు సిద్దహస్తులు. నాకు ఆయన రాసిన "నా ఇష్టం" యొక్క "వెనుకమాట" చదివిన తర్వాత ఏమనిపించింది అంటే ఆయన "ఆయని సినిమా చూసే ప్రేక్షకుడినే కాదు ఆయని పుస్తకం చదివే పాటకుడిని కూడా ప్రిపేర్ చేయటంలో సిద్దహస్తులు" అని.
ఒక మనిషి జీవితాన్ని కాని తన జీవితంలోని ఆలోచనలని కాని చదివితే తన జీవితం కుడా మనం జీవించిన వారిమావుతం. - రామ్ గోపాల్ వర్మ
మనిషి నిత్య విద్యార్ధి, ఆయని అనుభవాలే ఆయనికి గురువు, ఆ అనుభవాలు నెర్పె పాటాలే ఆయని జీవన మార్గదర్శికాలు. ఇది వినటానికి వేదాంతం లాగ ఉన్నా నాకు తెలిసినంతవరకు ఇదే నిజం. మన అనుభవాలు చెప్పినంత ఘాటుగా, లోతుగా ఇంకెవ్వరు మనకి చప్పలేరు. వాస్తవానికి, మనం తెలుసుకోవాల్సింది, అనుభవించాల్సింది, అనుభూతి చెందాల్సింది వాటితో మనకున్న కాలపరిమితిని పోల్చుకుంటే పాతాళానికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. మనుషుల్లో చాల మందికి ఒకటే రకమైన సంఘటనలు ఎదురయ్యే సందర్భాలు చాలానే ఉంటాయి.ఈ భూప్రపంచంలో అనేకమంది మనుషులు ఒకే రకమైన ఆలోచన తీరుతో ఉంటారు, ఇందులో ఎటువంటి సందేహంలేదు. ఒకే రకమైన ఆలోచనతీరుతో ఉన్న మనుషులు తమకు ఎదుటపడుతున్న సమస్యలను ఎదురుకునే విధానం కొంచం ఇంచు మించు ఒకే రకంగా ఉంటుంది. అటువంటప్పుడు మనకు మనలా ఆలోచించే మనలాంటి వారి ఆలోచనలు తప్పకుండ ఉపయోగపడుతాయి. ఎదుటి వారు మనలాగే ఆలోచించక పోయిన, మనకి చాల సందర్భాలలో మనం వాళ్ళ లాగే ఆలోచిస్తే బాగుండు అని అనిపించే సందర్భాలు కూడా చాలానే ఉన్న్తాయి.
మనము అటువంటి వారి జీవితాలని చదివిన, వారి ఆలోచనలని చదివిన మనకి అవి ఎంతగానో ఉపయోగపడుతాయి.
నన్ను బాగా ప్రభావితం చేసిన చాలామంది తత్వవేత్తల రచనలు, ఫిక్షన్ రచనలు, చివరికి కామిక్ పుస్తకాలు కుడా నాకు జీవితాన్ని అర్ధం చేసుకోవడంలో చాలా సహకరించాయి. అన్ని పుస్తకాలు నేను చదివినప్పుడు నా పుస్తకం కుడా కొందరితోనైన చదివిద్దామన్న అభిప్రాయంతో ఈ పుస్తకం రాయడానికి పూనుకున్నా. - రామ్ గోపాల్ వర్మ
దీన్ని బట్టి నాకు "మనం చదవవలసిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి అని, అవి చదివితే సరిపోదు అందులోని సారాంశాన్ని ఆస్వాదించి ఆచరించే ప్రయత్నం చేయాలి" అని. రాము గారు ఆయని పుస్తకాన్ని చదివిద్దాం అని చెప్పటంలో నాకు అనిపిస్తుంది ఏంటి అంటే "నేను చాలా పుస్తకాలు చదివి, చాలా అనుభవం గడించి, ఆ అనుభవంతో నా జీవితాన్ని నడిపించా. అయితే నా లాగ ఎంత మందికి ఇలా చదివే అవకాసం వస్తుంది అందుకే నేను ఒక పుస్తకం నా అనుభవాల గురించి రాస్తే, వారు నేను చదివిన పుస్తకాలన్నీ చదివిన వారు అవుతారు అనే ఉద్దేశం తో ఈ 'నా ఇష్టం' రాసారు" అని.నాకు నా కుటుంబంలో నా వారసులు కన్నా నా ఆలోచనలే అక్కడక్కడో ఎక్కడెక్కడో మిగిలుండాలన్న ఓ కోరిక ఉండబట్టి కూడా ఈ పుస్తకం రాసాను. - రామ్ గోపాల్ వర్మ
మనకి శ్రీ రాముడు, మహాత్మా గాంధీ,స్వామి వివేకానంద, భగత్ సింగ్, కార్ల్ మార్క్స్, చే గువేరా ,మదర్ తెరెసా, నెల్సన్ మండేలా ఇలా ఎంతో మంది గొప్పవారు తెలుసు. వీరి ఆలోచన తీరు మనల్ని వీరికి
దగ్గర చేసింది అంతే తప్ప వారి వంశం కాదు. వాస్తవానికి ఇలాంటి గొప్ప వారి వంశం గురించి మనకి
తెలియదు, తెలుసుకుందాము అనే ఆలోచన తట్టదు కూడా. నా లాంటి రాము గారి అభిమానులకు ఆయన
పైన చెప్పిన మాట ఎంతో సంతోషాన్ని ఇచ్చి ఆయని ఆలోచనల ద్వారా మేము ఆయనకు దగ్గరగా, ఆయనతోనే ఉంటాము అనే ఒక భరోసా ఇచ్చింది.
నాకు ఊహ తెలిసినప్పట్నుంచి నేను దేవుడిని నమ్మలేదు, పెద్దలని గౌరవించలేదు, స్నేహానికి విలువివ్వలేదు, చదువు మీద ద్యాస పెట్టలేదు. కాని సినీ కళని చాలా ఘాడంగా నమ్మాను, గౌరవించాను, విలువిచ్చాను, ప్రేమించాను. . - రామ్ గోపాల్ వర్మ
"మనం ఎంత చెప్పిన ఎదుటి వాడు మనం చెప్పినదాంట్లో వాడికి నచ్చింది మాత్రమే తీసుకుంటారు" అని
రాము గారు ఎప్పుడూ చెబుతుంటారు. దేవుడు అంటే భయం ఉన్న నేను, రాము గారు "దేవుడిని నమ్మలేదు" అని అంటుంటే, ఆయన దేవుడు గురించి చెప్పిన అది అర్ధం చేసుకునే అంత సీన్ మనకు లేదు అనుకుంటూ, ఆయన మనకున్న రకరకాల దేవుడిలో ఏ దేవుడిని నమ్మట్లేదు అబ్బా అని ప్రస్నించుకుంటూ , ఆయన విగ్ర ఆరాధన నమ్మరేమో అని జవాబు చెప్పుకుంటూ, ఆయన ఆకారాన్ని నమ్మరేమో గాని ఆ దేవుడికి మాత్రం
భయపడతారు అని నేను ఆయన చెప్పిన మాటలోనుంచి నాకు నచ్చింది తీసుకున్న :):).
ఆయన వయసుతో వచ్చిన పెద్దరికం గురుంచి చెబుతుండవచ్చు.మనం ఎంత మంది పెద్దలను వారి ఆచార వ్యవహారాలు బట్టి దూసించట్లేదు చెప్పండి!!
మనము స్నేహానికి విలువ ఇస్తున్నామా!! దీని గురించి మాట్లాడాలి అంటే ముందు స్నేహం అంటే అర్ధం, ఆ తరవాత మనకున్న రక రకాల మనస్తత్వాలు ఉన్న స్నేహితుల గురించి; మన స్నేహంలో వారు, వారి స్నేహంలో మనం పొందుతున్న మంచి చెడుల అనుభూతిని; మన స్నేహం వారితో, వారి స్నేహం మనతో కొనసాగుతున్న రోజుల సంఖ్య, ఆహ్ ఇలా చాలానే మాట్లాడుకోవాలి.
ఆయన చదువు మీద ద్యాస పెట్టి ఉంటె, ప్రపంచ సినిమా చరిత్రలో కొన్ని కోణాలు, కొన్ని అధ్యాయాలు ఉండేవి కావు!!
చదువు మీద ద్యాసా, స్నేహం విలువా, పెద్దలను గౌరవించటం, దేవుడిని నమ్మటం ఇలా ఆయన చెప్పిన ప్రతి దానికి ఒక నిర్ధిస్టమైన నిర్వచనం ఉండి ఉంటె, ఒక వేల ఉన్నా దాని గురించి నాకు తెలియదు కాబట్టి, అందులోనూ రాము గారు ఏ విషయం గురించి చెప్పిన అందులో అంతులేని లోతుల్లోకి వెళ్లి దాని గురించి తెలుసుకొని చెబుతారు కాబట్టి, పైన చెప్పిన వాటిమీద ఆయనకున్న ఒక అభిప్రాయంతో, (వాటికి ఆయన నూరు శాతం న్యాయం చేయలేదు అని అనిపించిందేమో అందుకే) ఆ విధముగా చెప్పి ఉండవచ్చు??.
వాస్తవానికి ఆయని "నా ఇష్టం" పుస్తకం చదవటానికి నాకు నాలాంటి సినిమా పిచ్చి ఉన్నవారికి ఆయన చెప్పిన "కాని సినీ కళని చాలా ఘాడంగా నమ్మాను, గౌరవించాను, విలువిచ్చాను, ప్రేమించాను." ఈ
ఒక్క మాట చాలు :)
ఈ
పుస్తకంలో సినిమాల మీద నాకున్న ఆలోచనలతో పాటు జీవితం పట్ల నా ఉహల గురుంచి కుడా చాల రాతలు ఉంటాయి. నేను ఇక్కడ రాసినవి రచనలు కాదు రాతలు. నాకు అప్పటికి
తోచింది, నేను ఊహించింది, నాకు అనిపించింది రాసేసాను. మీకు నా ఇక్కడి రాతలు కొన్ని నవ్వు తెప్పించవచ్చు. కొన్ని కోపం తెప్పించవచ్చు, కొన్ని ఇర్రిటెట్ చెయ్యవచ్చు, కొన్ని కాంట్రావేర్సి గా కుడా ఉండవచ్చు. అది ఎందుకంటే, జీవితంలో మనందరికీ వేరే వాళ్ళ మీద, వేరే వాళ్ళందరికీ మన మీద కూడా నేను పైన చెప్పిన భావాలన్నీ ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా కలిగి ఉంటాయి. ఇది వాళ్ళ వాళ్ళ యుక్తాయుక్త
విచక్షణ, పరిసరాల రీత్యా అలవడిన జ్ఞానం, మానసిక స్థితితో పాటు జీవితంలోని భిన్న అనుభవాల ద్వారా ఏర్పడిన పర్సనల్ ఎమోషన్స్ పై ఆధారపడి ఉంటుంది. - రామ్ గోపాల్ వర్మ
ఇది కాదనలేని సత్యం!!
ఆచార్య మీరు ఇంత స్పష్టంగా జ్ఞానోదయం చేసిన తర్వాత మేము ఒక స్పష్టమైన ఆలోచనతోనే మాకు కావలిసింది మాత్రమె మేము మీ పుస్తకం నుంచి తీసుకుంటాం:)
నాకు నిలకడ ఉండదు, నేను అన్నమాట మీద నిలబడను. మాటి మాటికి మనసు మార్చుకుంటాను. - రామ్ గోపాల్ వర్మ
నాకు తెలిసినంతవరకు మనం ఒక సందర్భంలో చెప్పే మాట పూర్వం మనకున్న అనుభవం మీద, ఇప్పుడు ఈ సందర్భంలో మన చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. సందర్భాలు మారుతున్న ప్రతిసారి, మన మీద వాటి ప్రభావం కూడా మారుతుంటుంది, అలాంటప్పుడు అన్ని సందర్భాలలో మనం ఒకే మాట మీద నిలబడగలమా!!
చాలా స్వార్ధపరున్ని, విపరీతమైన తలపొగరున్న వాడిని. - రామ్ గోపాల్ వర్మ
స్వార్ధపరుడు కాని వారేవరండి!!, ఆఖరకు పక్కవాడికి సహాయం చేసేవారు కూడా తను ఒక మంచి పని చేస్తున్న అనే తృప్తి కోసమే కదా చేస్తారు.
అహం బ్రహ్మస్మి...దేహమే దేవాలయం....అంటూనే నన్ను నేను ప్రేమించుకుంటే అది స్వార్ధము అంటామ?? రాముగారు చెప్పే తలపొగరు బయటకు వ్యక్తపరిచే తలపొగరు(తలబిరుసు) కాకపోవచ్చు...అది ఆయనకీ, ఆయన జ్ఞానం మీద ఉన్న తలపొగరు అయ్యి ఉండవచ్చు. ఆయనకి తెలిసిన జ్ఞానాన్ని ఉన్నదీ ఉన్నట్టు బయటకు వ్యక్త పరిస్తేనే కదా కొత్త జ్ఞానర్జనకు తావుంటది!!.
ఇక్కడ నా రాతలన్ని నేను పైన చెప్పిన బ్యాక్ గ్రౌండ్ లోంచి వచ్చినవే. ఇంత చెప్పిన తర్వాత కుడా మీరు ఇంకా ఈ పుస్తకం చదివితే అదింక మీ ఇష్టం. . - రామ్ గోపాల్ వర్మ
రాము గారు ఒక సినిమా తీసినప్పుడు, అది ఆయన ఎందుకు తీసారు, అందులో ఆయన చూపించేది ఏమిటో, ఆ సినిమా నుంచి ఎటువంటి అనుభూతు పొందవచ్చో అన్ని విషయాలు ప్రేక్షకుడికి ముందుగానే వివరిస్తారు. నాకు తెలిసినంతవరకు, ఒక సినిమా ప్రమోషన్ ని రాము గారు చేసినంత
గొప్పగా, నిజాయితిగా ఇంకెవ్వరు చేయలేరు.
ఒక ప్రేక్షకుడు లేదా పాటకుడు తను చూడబోయే సినిమా లేదా తను చదవబోయే పుస్తకం గురించి ఇంతగా ఇన్ని విషయాలు, విశేషాలు తెలిసినతర్వాత కచ్చితంగా అవి నచ్చినవాడు మాత్రమె ముందడుగు వేస్తాడు. అంత ఇష్టం తో తను సినిమాకు వెళ్ళిన, ఒక పుస్తకం చదివిన, కచ్చితంగా తను అది అర్ధం చేసుకుని ఆస్వాదించే ప్రయత్నం చేస్తాడు.. కాకపొతే తనకు అర్ధం అయ్యేది ఆ సినిమా దర్శకుడు లేదా పుస్తక రచయిత చెప్పాలనుకునేది ఒకటే అయ్యి ఉండవచ్చులేదా వేరు వేరు కావచ్చు!!
అందుకేనేమో రామ్ గోపాల్ వర్మ గారు "నా ఇష్టం" తో నేను మాట్లాడేదానికి అర్ధం "మీ ఇష్టం" తో మీరేమి అర్ధం చేసుకుంటే అదే" అని అన్నారు....
No comments:
Post a Comment