Sunday, 1 December 2013

ఆయని 'నా ఇష్టం' లో నా ఇష్టం -1

రాము గోపాల్ వర్మ గారికి ఉన్న వీరాభిమానుల్లో, ఆయనకి ఉన్న అనేకమంది ఏకలవ్య శిష్యులలో నేను ఒకడిని. నాకు ఆయన సినిమా దేవుడు, నేను ఆయనకు భక్తుడని!! ఇది చదువుతున్న వారికి నేను చెబుతున్నది కొంచం అతి అనిపించినా, ఆయన నా సినిమా దేవుడు అనటానికి నేను ఎటు వంటి తత్తరపాటుకి లోనవ్వదలుచుకోలేదు.

నన్ను ఇంతగా ప్రభావితం చేసింది, ఆయన “నా ఇష్టం” పుస్తకమే. అది చదివిన తర్వాతా, నా సినిమా జీవుతాన్ని ఒక పద్దతిలోకి తెచ్చుకున్న.  నేను ఆ పుస్తకం చదివిన ప్రతి సారి, నాకు అది కొత్త అనుభూతిని ఇస్తూనే ఉన్నదీ. ఆ పుస్తకం చదివినప్పుడు, నాకు ఆ పుస్తకంలో ని  ఆయని మాటలు, చేష్టలు, ఏ విధంగా అనిపించిందో రాసుకుంటే, నాకు ఒక స్పష్టత వస్తుంది అనే ఉద్దేశంతో, రాయటం మొదలుపెడుతున ఈ నా పోస్ట్ "ఆయని 'నా ఇష్టం' లో నా ఇష్టం"

గమనికి: సహజంగా, కొన్ని పనులు పూర్తికావటానికి, చాల రోజులు పడుతుండ వచ్చు. కొన్ని మధ్యలోనే ఆగిపోవచ్చు. ఆయన "నా ఇష్టం" పుస్తకం గురుంచి నా ఇష్టం ఉన్నంతకాలం, నా ఇష్టం వచ్చినట్లు రాసుకుంటా!! 




నా ఇష్టం: అర్ధవంతమైన పేరా | అర్ధరహితమైన అహమా!!

·         తన గురుంచి తానే చెప్పుకొంటున్నప్పుడు

·         తనకు నచ్చినవి ప్రస్తావించినప్పుడు

·         తనకు నచ్చనివి ప్రస్తావించి, పరోక్షంగా తనకు నచ్చేవి ఇవి అని తెలియజేస్తున్నప్పుడు

·         ప్రతిక్షణం తనకు నచ్చినట్టు తను బ్రతికిన తన జీవిత చరిత్రను, ఇవి తన ఇష్టాలు అంటూ తన ఇష్టాలను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తెలియజేస్తూ తను రచించ్చిన తన పుస్తకానికి "నా ఇష్టం"(లు) అని పేరు పెట్టడంలో, నాకు ఆయన ఒక అర్ధవంతమైన పేరు పెట్టారు అని అనిపిస్తుంది తప్ప, ఇందులో ఏదో అర్ధరహితమైన అహం వుంది అని నేను అనుకోలేను 


అంకితం: నాకే!!

నాకు తెలిసినంతవరకు, ఒక విజయాన్ని గాని, పుస్తకాన్ని గాని, సినేమాన్ని గాని, పనికి స్పూర్తినిచ్చి కార్యక్రమానికి మూలకారనమైన వ్యక్తికి 'అంకితం' చేస్తాం. అటువంటప్పుడు, తన జీవితాన్ని గురుంచి రాసుకోవాలనిపించే విదంగా తనకు స్పూర్తిని కలిగించిన తన జీవితానికి అంకితం ఇచ్చుకోవడంలో ఒక నిజాయితే తప్ప, ఎటువంటి అహం అందులో నాకు కనబడటం లేదు !!



 

No comments:

Post a Comment