Sunday, 1 December 2013

ఆయని 'నా ఇష్టం' లో నా ఇష్టం - 2

ఎమెస్కో విజయకుమార్: అతనిష్టం మనకిష్టం!!

ఈయన రాము గారి గురించి ప్రస్తావించిన పేజీలో మొదటి వాక్యం: ' నేనొక దుర్గం-నాదొక స్వర్గం!! అనితరసాధ్యం నా మార్గం!!' అన్నారు శ్రీశ్రీ అని వుంది.

వాస్తవానికి శ్రీశ్రీ గారు ఎంత గోప్పవారో చెప్పలేనంత అజ్ఞానం ఉన్నవాడిని నేను. కాకపొతే ఎందరో(నాకు అనిపించిన) మేధావులు శ్రీశ్రీ గారిని పొగిడే విధానంలో ఒక్కటి స్పష్టంగా నాకు తెలిసింది ఏమిటి అంటే, ఈయన సాహితీ ప్రపంచంలో అందుకోలేనంత ఎత్తు లో వున్నారు అని!!

అంతటి గొప్ప వ్యక్తి వాక్యం లా రాముగారు ఒక ప్రత్యేకమైన శైలితో, అనితర సాధ్యమైన మార్గంలో స్వర్గానుభూతి చెందుతున్నార?  ఆయన అంత ప్రత్యేకమైన వ్యక్తా??  ఆయని మార్గం మొదలు బాల్యం లోనే అయ్యిందా??? ఇలా నాకు ఎన్నో ప్రశ్నలు!!

విజయకుమార్ గారు ఇంకా చెబుతూ....

·         రాము గారు నాకెప్పుడూ ఆశ్చర్యం, ఆశ్చర్యం ఆయన్ని కలిసిన తర్వాత ఇంకొంచం పెరిగింది.

·         ఆయన తన చుట్టూ ఉన్నప్రపంచాన్ని చూసే పద్ధతి చాలా విభిన్నంగా వుంటుంది

·         అనితరమైన పరిశీలనా శక్తీ ఆయన ఆయుధం

·         పరాజయం, విజయాలకు అతీతంగా వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం కొందరు మాత్రమే చేయగలరు, కొందరిలో ఒకరు రాము గారు.

·         కలపిపాస ఆయన్ని దర్శకునిగా మార్చి ఉండవచు. ఆయన ఒకవేళ సుప్రసిద్ధ దర్శకుడు కాకపోయినా సమాజంలో ఏదో ఒక రంగంలో స్పష్టమైన ముద్రను మిగిల్చేవాడనేది విజయకుమార్ గారి అభిప్రాయం.


విజయకుమార్ గారి మాటలు విన్న తర్వాతా, రాము గారు కలిగించే ఆశ్చర్యం, ప్రపంచాన్ని బిన్నంగా ఆయన చూసే పద్ధతి, అనితరమైన ఆయన పరిశీలనా శక్తీ,పరాజయం, విజయాలకు అతీతంగా మలుచుకిన్న ఆయన వ్యక్తిత్వం, ఆయన కళాపిపాస వీటన్నిటి గురుంచి, అవి ఆయనకీ సొంతం అవ్వటానికి గల కారణాలు, అందులో ఆయని బాల్యం ఎంత వరకు పనిచేసింది అని తెలుసుకోవాలనే నా కుతూహలం ఎప్పటికి తీరుతుందో!!

ఆయన దర్శకుడు కాకపోయినా, ఏదో ఒక రంగంలో స్పష్టమైన ముద్రను మిగిల్చేవాడనేది విజయుమార్ గారి లాగ చాలా మంది నమ్మకం. ఒకరు అనుకున్న పని విజయవంతంగా చేయటానికి కావాల్సిన కనీస లక్షణాలు ఈయన వద్ద పుష్కలంగా వున్నాయి!!

తాను తాత్విక భూమికనుంచి ఆలోచిస్తున్నాడో, తన జీవన తాత్వికత ఏమిటో యదార్ధంగా అలాగే మనకు కనబడాలని, తనని అత్యంత నగ్నంగా మన ముందు ఉంచాలని ఆయని ఆలోచన కావొచ్చు అని విజయకుమార్ గారు అంటున్నారు.
ఆయన అనుకున్నది అనుకున్నట్టు యధేచ్చగా మాట్లాడుతున్నా, కనబడుతున్నా, కొన్ని సందర్బాలలో ఆయన తను అనుకుంటుంది లోపలే ఉంచేసి, ఎదుటివాడు ఆయన దగ్గర నుంచి సమాధానం ఆసిస్తాడో అటువంటి సమాధానం, ఎదుటివాడిని వెధవని చేసే సమాధానం ఇస్తుంటారు. ఏమో మరి ఆయనికి క్షణం లో అసలు సమాధానం దాయటములొ అర్ధం దాగుందో!! అది ఆయన సరదాకి చేసినప్పటికీ, దీనివల్ల తన నగ్నత్వానికి ఆటంకం కలుగుతుంది అని నా అనుమానం!!

రాముని చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే "ప్రాసెస్ అఫ్ లెర్నింగ్" ఎంత ముక్యమో "ప్రాసెస్ అఫ్ అన్ -లెర్నింగ్కూడా అంతే ముక్యమని. అప్పుడే మనిషి నిరంతరం బాల్యంలో జీవించ కలుగుతాడు-విజయకుమార్ గారు
నేను పుట్టుకతోనే వ్రుద్దున్ని, అందుకే బాల్యం వైపు పరుగులు తీస్తున్న- రాముగారు

వీరిద్దరు,అంతగా ఎదుగుతున్న మనిషిని బాల్యంలో జీవించాలని ఎందుకు అంటున్నారు?అసలు బాల్యంలో ఏముంది...నాకు తెలిసినంతవరకు...

·         వయసుకు తెలుసుకోవటానికి చాలా ఉంటాయి

·         ప్రతి కొత్త విషయం చాల అద్బుతంగా అనిపిస్తాయి/ కనిపిస్తాయి

·         చేస్తున్న పని మీద ద్యాస తప్ప ఇంకో ఆలోచన ఉందదు

·         మాటలో, మనసులో, ఆటలో, కల్ముషం ఉండదు

·         అడిగిన, ఇచ్చిన, నచ్చిన, నచ్చకపోయ్న, చెప్పిన, చెప్పకపోయ్న, ఏది చేసిన అంత వాళ్లకి ఇష్టం ఉన్నట్లే చేస్తారు. అంత 'నా ఇష్టం ' అని చెప్పకనే చెబుతారు.

·         బాల్యంలో మనిషి, మనసు అంటూ రెండు నాలుకలు వుండవు.

తనని నిజాయితి ప్రెజంట్ చేసుకోవటం ఆయనికి ఇష్టం, ఆయనిష్టం మనకిష్టం.-- ఎమెస్కో విజయకుమార్

నాకు అర్ధం అయ్యినంతవరకు, ఆయన తనని నిజాయితి మన ముందు ప్రెజంట్ చేయట్లేదు. ఆయన తన మనషాక్షి కి తన నిజాయితిని ప్రెజంట్ చేసి, తనకి తన మనసుకు వున్నా దూరాన్ని చెరెపే ప్రయత్నంతో తిరిగి తన బాల్యం లోకి వెళ్ళే పనిలో వున్నారేమో!!

No comments:

Post a Comment