ఈ మద్య కాలంలో వచ్చిన గెట్టి కథా బలం ఉన్న సినిమాల్లో
"ఐస్ క్రీం" ఒకటి.
ఈ మద్య కాలంలో వచ్చిన RGV గారి సినిమాలు అన్నిటి కంటే ఈ
"ఐస్ క్రీం" గొప్ప సినిమా అనిపించింది.
ఈ మద్య కాలంలో వచ్చిన అర్ధవంతమైన సినిమా టైటిల్స్ లో
"ఐస్ క్రీం" ఒకటి. అది ఎలానో తెలియాలి అంటే ముందు మనం రెండు విషయాలు తెలుసుకోవాలి.
(1) నిద్ర పోయేముందు ఐస్ క్రీం ఎక్కువుగా తింటే పీడ కళలు వస్తాయి.
(2) ఈ సినిమా "కలలో కనపడేదానికి, కళ్ళ ముందు కనపడేదానికి
తేడ తెలుసుకోలేనంత మెంటల్ డిసార్డర్ లో ఉన్న ఒక అమ్మాయి చుట్టూ జరిగిన యదార్ధ సంగటనల నుంచి తయారు చేయబడింది.
ఐస్ క్రీం సినిమా చూసి అర్ధం చేసుకున్న ఎక్కువ శాతం మంది ఆ
సినిమాకు ఐస్ క్రీం గొప్ప టైటిల్ అని అంగీకరిస్తారు. చూడని వాళ్ళు ఇదేమి చెత్త టైటిల్
రా బాబు అనుకుంటారు, ఎందుకంటే నేను చూడకముందు అలానే అనుకున్న....
కథ గురించి మాట్లాడుకునే ముందు రెండు విషయాలు:
(1)దేవుడిని నమ్మని వారి సంగతి ఏమో గాని, దేవుడిని నమ్మే ప్రతి
ఒక్కరు దెయ్యాన్ని నమ్మవలసిందే!!మన దేవుల్లో ఎక్కువ సేతం మనిషిగా పుట్టి మరణించిన వారే.
మన జాతికి మంచి చేసి మరణించిన వారు దేవుడైనప్పుడు చెడు చేసి మరణించిన వాడు దెయ్యమే
కదా... దేవుడు ప్రతి చోటా ఉన్నట్టు దెయ్యము ప్రతి చోటా ఉంటుంది కదా. కాకపోతే మనలోని
ధైర్యం, దైవత్వం, దెయ్యాన్ని దూరంగా పెడుతుంది... దేవుడి దయ పొందటానికి కొన్ని పద్దతులు
(పూజలు, వ్రతాలు) ఎలా ఫాలో అవుతామో దెయ్యాన్ని దూరం పెట్టటానికి దిష్టి బొమ్మ, నిమ్మ
కాయలు, తాడు లాంటివి ఎన్నో ఫాలో అవుతాము.
(2) దెయ్యాన్ని నమ్మి దాన్ని నుంచి బయటపడే మార్గాలు అన్వేసిన్చేవారు
ఒక రకం... దెయ్యాన్ని నమ్మకుండా దాని సంగతి తెల్చాలనే వారు మరో రకం...ఇంకో రకం ఉంది,
వారే ఈ కథకు మూలం: దెయ్యాన్ని గెట్టిగా నమ్మలేరు, అట్లా అని చెప్పి పూర్తిగా ఇవి ఉండవంటు
కొట్టి పారేయను లేరు... వీరికుండే ప్రదాన శత్రువులు
రెండు.
(అ) వీరికి భయాన్ని కలిగించే సంగటనలు జరగటం...
(ఆ) వీరి భయానికి అర్ధమే లేదంటూ వీరికి ధైర్యం చెప్పేవారు
ఉండటం...
ఈ రెండు విషయాలు వాటి
ఫలితాలు చాలా స్పష్టంగా ఐస్ క్రీం సినిమాలో చూపించారు రామ్ గోపాల్ వర్మ గారు...
ఈ "ఐస్ క్రీం" సినిమా లో హీరోయిన్ భయపడటానికి కారణాలు:
- అప్పుడే హారర్ సినిమా చూసి రావటం
- ఆ ఇంటికి దుష్ట శక్తుల నుంచి రక్షణ కలిపించే బొమ్మను హీరో కాలితో తన్నటం
- కొత్తగా వచ్చిన అంత పెద్ద ఇంట్లో ఇప్పుడ తను ఒక్కతే ఉండబోవటం
- ఐస్ క్రీం బాగా తినటం వళ్ళ అయ్యివుండవచ్చు, లేక పైన మూడు విషయాలవల్ల అయ్యీ ఉండవచ్చు, తనకు దారుణమైన పీడ కళలు రావటం..
- కలలోకి వచ్చింది కళ్ళముందు కనపడటం, కళ్ళ ముందే కలలోకి వెళ్ళటం...కల ఏదో నిజమేదో తెలుసుకోలేనంతగా ఒక దాని తర్వాతా ఒక సంఘటన జరగతూ ఉండటం...
- మొదట్లో హీరో కావాలని భయ పెట్టటటం, ఆ తర్వాతా ఆమె భయానికి లాజికల్ రీసన్ చెప్పుకుంటూ ఆమె కలలోకి వస్తుంది ఆమె కళ్ళ ముందే జరుగుతునట్టు అనిపిస్తుంది తప్ప అది నిజం.....
ఇంక చాలు మిగతాది మీరు సినిమాలో చూడండి.. ఇంకో విషయం మన ప్రేక్షకులు
చాలా తెలివి కలవారు కాబట్టి మన రామ్ గోపాల్ వర్మ గారు ఈ సినిమలో చాల మంది ఫాలో అయ్యే
"అరటి కాయి వలచి నోట్లో పెట్టిన విదంగా" కాకుండా చాల గొప్పగా ప్రేక్షకుడు
ఆలోచించే విదంగా స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ అద్బుతంగా
అందించారు...
ఈ సినిమాలో చూపించిన మెంటల్ డిసార్డర్ పాయింట్ ని "బారి బడ్జెట్" తో చూపించవచ్చు, ఈ
ఐస్ క్రీం సినిమా లా "లో బడ్జెట్ " తో చూపించవచ్చు... ఒక ప్రేక్షకుడిగా నాకు
ఈ ఐస్ క్రీం సినిమా బాగా నచ్చింది, సినిమా ఆద్యంతం నన్ను భయపెట్టింది, నాకు ధియేటర్
లో కూర్చున్న సమయం వ్రుదా కాలేదు అనే ఒక సంతృప్తి వచ్చింది. ఇంక బడ్జెట్, కలెక్షన్స్
విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మ గారు చెప్పిన ప్రకారం "ఐస్ క్రీం కి మేము పెట్టిన
ఖర్చెంతంటే కేవలం ఒక్క రోజు కలెక్షన్లతో ప్రొడ్యూసరు,డిస్ట్రిబ్యూటర్లు వాళ్ల పెట్టుబడి
రికవర్ చేసుకున్నారు." ఇది బాక్స్ ఆఫీసు హిట్ సినిమానే!!
చివరిగా ఇంకో విషయం....
"నేను ఐస్ క్రీం లో ఇంట్రొడ్యూస్ చేసిన హై కాన్సెప్ట్-లో
బడ్జెట్ ప్యారెలల్ సినిమా గాని, గింబల్ రిగ్ గాని ఎప్పటికీ ఉండిపోతాయి. దీనికి నేను
చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను."- రామ్ గోపాల్ వర్మ
ఈ హై కాన్సెప్ట్-లో బడ్జెట్ సినిమాలు మన ఇండస్ట్రీ కి ఎంతో
అవసరం, నాకు అర్ధమైనన్థవరకు ఈ "ఐస్ క్రీం" సినిమాలో హై కాన్సెప్ట్ ఉంది అని
నా ఫీలింగ్ కాకపోతే అది ఎంత మందికి అర్ధం అయ్యింది అనేది నేను చెప్పలేను...
Navadeep feeling very happy and proud for you on acting
in RGV sir film, thanks a lot.
RGV AACHARYA, thanks for giving one more movie in the
name of “Ice Cream”.