కొన్ని అనుభవాలను రాసుకొని దాచుకోవాలి ... ఎందుకంటే అవి చిరస్మరనీయమైనవి కాబట్టి!!
నన్ను అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మొదటి స్థానం మా ఆచార్యులు రామ్ గోపాల్ వర్మ గారికే చెందుతుంది…
ఆయన కేవలం నా సినిమా దేవుడు మాత్రమె కాదు, ఆయన నా ఆలోచనలకి ఇంధనం, నా జీవన శైలికి దిక్స్చుచి…
నాకు సినిమాలు అంటే పిచ్చి ఉన్నప్పుడు, అందరి డైరెక్టర్స్ లో ఒకరిల ఆయని మీద గౌరవం ఉంది, విశ్వనాధ్ గారు, వంశీ గారు మీద లాగే రాము గారి మీద కూడా ప్రేమ ఉండేది..
నాకు ఆయని మీద ఉన్న ప్రేమ, గౌరవం హద్దులు దాటి 'RGV' అనే ఒక వ్యసనానికి బానిస చేసింది మాత్రం ఆయని సినిమాలు కంటే ఆయన ఆలోచన, జీవిత విధానాలు మాత్రమె అనే చెప్పాలి..
రాము గారు ఒక ఇంజనీరింగ్ పట్టాదారుడు అని తెలిసి, నేను కూడా ఇంజనీరింగ్ చదివినవాడిని కాబట్టి నాకు ఆయని ఆలోచనలు ఉపయోగ పడతాయేమో అని ఆయన గురుంచి తెలుసుకోవటం మొదలుపెట్టా ..
ఆ రోజుల్లో ఆయని వ్యాసాలు ఒక వెబ్ సైట్ లో నుంచి సేకరించి చదివేవాడిని, నన్ను కొంచం కొంచం గా ఆయన ఆహవించటం మొదలుపెట్టారు ..
ఏప్పుడైతే ఆయని 'నా ఇష్టం' పుస్తకం చదివానో, నన్ను ఆయన పూర్తిగా లొంగ తీసుకున్నారు..
నేను ఆయనికి లొంగిపోటానికి నాకు రెండు కారణాలు అనిపిస్తాయి...
మొదటిది నాకున్న సినిమా పిచ్చి ఒక క్రమపద్దతిలో ఒక రూపు దాల్చి సినిమానే జీవితం అనే స్థాయికి మారింది ఆయని నా ఇష్టం బుక్ లోని ఆయన జీవన విధానం తెలుసుకున్నతర్వాత మాత్రమె..
రెండొవది, ఎందుకో నా ఆలోచనలు ఎటు ప్రవహిస్తున్న ఏదో ఒక చోట ఆయని ఆలోచనల ప్రవాహంలోకే చేరుతున్నాయి అని అనిపిస్తుందీ కాబట్టి..
ఇంతగా 'RGV' అనే ఒక వ్యసనం లో మునుగుతున్న నేను ఏనాడు ఆయనని ప్రత్యక్షంగా కలవలేదు,
కలవాలనే కోరిక ఉన్నా, ఎప్పుడైతే సిరాశ్రీ గారు రాసిన "వోడ్కా విత్ వర్మ" చదివి పురిజగన్నాథ్ గారి లాంటి వాళ్ళు, మధుర శ్రీధర్ గారి లాంటి వాళ్ళు నాకంటే ఏక్కువుగా ఆయన మతులో తేలుతున్నారు,
సిరాశ్రీ గారు ఏకంగా ఆయని మీద ఒక పుస్తకమే రాసారు..
ఇంత ప్రముకుల స్థాయి నుంచి నా స్థాయి వరకు చాలా చాలా మంది నాకంటే ఏక్కువగా RGV గారి మతులో తూలుతున్నారు అని తెలిసేకోద్ది ఆయనని నాలాంటి వాళ్ళు కలవటం అసాధ్యం అనే ఆలోచనకి వచ్చేసా..
కాని ఆయన మత్తు మనలను ఊరకనే ఉండనీయదు గా, అందుకే ఏదో ఒక రూపం లో ఆయన దృష్టిలో పడాలి అని, పరోక్షంగానైన ఆయన నుంచి జ్ఞానం పొందాలని..
ఆయని సత్య, శివ, The Attacks of 26/11, శత్య2 సినిమాల నుంచి నేను నేర్చుకుంటుంది, వేరే విషయాల గురుంచి ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటుంది ఒక బ్లాగ్ లో రాసి ఆయనికి twitter లో పోస్ట్ చేసేవాడిని..
ఆయన tweets కి నాకు అర్ధమైన సమాధానాలు ఇచ్చేవాడిని.. కాని ఆయన నుంచి ఇప్పటివరకు ఒకే ఒక్క రెస్పాన్స్ ఆయినా పొందే అదృష్టం ఇంకా నేను నోచుకోలేదు..
ఇది ఇలా వుండగా, నా ఆలోచనలకు నా కథలకు దగ్గరగా ఒకరి సినిమాలు నన్ను బాగా ఆకర్షించాయి .. ఆయనే మన మధుర శ్రీధర్ గారు
ఆయనకీ ఎంత గొప్ప మనసు లేకపోతే, just tweetlo పెట్టిన న రిక్వెస్ట్ కి immediate గా స్పందించి, నన్ను ఇంతకాలం బరిస్తున్నారు :)..
నా మీద ఆయన చూపించే వాత్స్యల్యం నేను ఏప్పటికి మరువను, ఒక వేల నేను మరిస్తే అది నా పాపమే అవుతుంది..
ఈ మహానుబావుని దయవలనె నా ఆచార్య RGV గారిని ప్రత్యక్షంగా కలిసి, నలుగురిలో ఒకరిల కనీసం ఫోటో దిగగలిగాను ..అసలు ఇది ఎలా జరిగింది అంటే...
ఒక రోజు, Satya2 ప్రీమియర్ ఉండొచ్చు అని అందరు అంటుంటే, నన్ను కూడా కొంచం consider చెయ్యండి అని మా గురుజి శ్రీధర్ గారికి message పెట్టాను .. దానికి సమాదానం రాలేదు :)
06NOv2013,
గురుజి మిమ్మల్ని కలవాలనుకుంటున కొంచం మీ ఫ్రీ టైం చెప్పండి అని message చస్తే, ఆయన నుంచి "రేపు Satya2 ప్రీమియర్ షో టికెట్స్ ట్రై చేస్తాను అక్కడ కలుద్దాం అన్నారు".
ఇక మన ఆశ్చర్యానికి, ఆనందానికి అవదులు లేవు.. అసలు ఆయనకు ఉన్న బిజీ కి నా ప్రీమియర్ షో రిక్వెస్ట్ అసలు గుర్తుకు రాదేమో అనుకుంటున్న సమయానికి భలే surprise చేశారు..
ఇది ఒక ఎత్తు అయితే, 07Nov13 న ప్రీమియర్ షో timings message కోసం యెదురు చూస్తున్న సమయంలో, షో cancel అయ్యేతట్టుంది అని గురుజి నుంచి message వచ్చింది, అంతటితో ఒక రకమైన నిరాశ ఆహవిన్చిందీ..
సాయంత్రమయ్యే సరికి షో cancel అయ్యింది అనే confirmation వచ్చింది, దానితో atleast గురువు గారిని కలుసుకుందాం అనుకున్న ఆయన ఒక పని లో బిజీ గా ఉండి కలవలేక పోయారు ..
ఇంతగా ప్రీమియర్ షో చూడాలనిపించింది, కేవలం RGV గారి సినిమా చుదామనే; RGV ను కలవగలం అనే ఆలోచనే నాకు తట్టలేదు.. మొతానికి సినిమా నెక్స్ట్ డే చుద్దాం అని fix అయ్యిన తరుణం లో ..
రాత్రి 9.40 కి , గురుజి శ్రీధర్ గారి నుంచి ఫోన్, ఆయన ఫోన్ చేయటమే surprise అయితే, ఫోన్ లో ప్రీమియర్ షో 10.30 ఉంది నీవు రాగలవ అని అడిగారు ..
క్షణం ఆలోచించకుండా సరే అన్నాను, ఆయన మంచి తనం వల్ల ఇంకో టికెట్ నా ఫ్రెండ్ vasu కి అడిగితే ఆ టికెట్ కూడా సెట్ చేసారు.. నాకు అప్పటికి సినిమా, అందులోనూ గురుజి తో కలిసి మన ఆచార్య గారి సినిమా చూస్తున్నాను అనే సంతోషం..
ప్రసాద్స్ లో షో టైం గురుంచి వెయిట్ చేస్తున్న సమయంలో, సడన్ గ RGV గారు నా ఎదురునుంచి అట్లా వెళ్ళారు, అప్పటికి గాని నాకు అర్ధం గాల RGV గారు కూడా ప్రివ్యూకి వస్తున్నారు అనీ..
ఆయనను అట్లా చూడగానే ఒక్కసారిగా నన్ను నేను, ఆ ప్రదేశాన్ని మరచి ఎటో వెళ్లి పోయా, కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.. మా వాసు గాడు రా పదా పైకి వెల్దం అంటున్నాడు...
నాకేమో అక్కడికి RGV గారు వెళ్లారు, మనం వేల్లోచో లేదో అని ఒక అయోమయ స్థితి..
అందరు వెళ్తున్నారు, సరే మనం కూడా దూరంగా ఆయనని చూదాం అనుకుంటూ పైకి వెళ్ళా..
నాకు మనసులో గెట్టి నమ్మకం, పైకి వెళ్ళే సరికి ఆయన ఏదో ఒక రూమ్లోకి వెళ్లి కూర్చుంటారు మనం వెళ్లి కూడా వేస్ట్ అనీ... కాని కాళ్ళు ఆ క్షణంలో మన మాట వినవుగా.. :)
పైకి వెళ్ళిన తర్వాతా, ఆయనను చూస్తుంటే మొదటి సారిగా చాల సన్నగా అనిపించారు (ఏమో ఫోటోలో, టీవీ లో చూసి ,డైరెక్ట్ గ చూస్తే అట్లా అనేపించారేమో..)
ఆయనని గంభీరంగా ఊహించుకుంటున్న నాకు, ఆయన సన్నగా ఉంటాం నన్ను బాదించింది .. ఆయనని తరచూ కలిసే గురుజితో ఇది ప్రస్తావిస్తే అది టీవీ లో కి, డైరెక్ట్ గా చూసేదానికి కొంచం తెడవుంటున్ది అనేసరికి మనసు కొంచం తేలిక పడింది..
ఆయన ఒక పక్కన ఉంటారు అనుకుంటే, జనాలలో కలిసిపోయారు, అటు,ఇటు తెగ తిరుగుతూ నా కనులకు మాంచి ఎనర్జీ ని ఇస్తున్నారు..
ఆయన ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు అనుకుంటా, వాళ్ళతో ఆయన నవ్వుతూ మాట్లాడుతుంటే నా మనసు తెగ సంబర పడిపోతుంది...
ఆయనకంటే డబల్ ఎత్తు ఉన్నఒక అబ్బాయితో ఆయన టికెట్స గురుంచి మాట్లాడుతున్నారు, నాకేమో ఆ అబ్బాయి అంత ఎత్తు ఉన్న మన ఆచార్య ముందు చాలా చిన్నగా అనిపిస్తున్నారు., అందరు వెళ్లి ఆయన తో ఫోటో దిగుతున్నారు..
నాకూ ఆయనతో ఫోటో దిగాలి అని ఉంది కాని వాలంత ఆయనికి తెలిసి ఉండ వచ్చు అందుకె అంత ధైర్యంగా దిగుతున్నారు అని అనిపించి నేను ఫోటో దిగటానికి ధైర్యం చేయలేదు..
సరే గురుజిని అడుగుదాం అనుకుంటే, నాకే మంచిగా అనిపించలేదు.. అసలు మనం ఏమి పొడిచామ్, మనల్ని గురుజి ఏమని పరిచయం చేస్తారు, ఆయనిని ఇబ్బంది పెట్టటం మంచిది కాదు అని సైలెంట్ అయ్యిపోయా.
వాసు ఏమో, నువ్వు వెళ్ళి ఆయన పక్కన నిలబడు ఫోటో తీస్తాను అంటాడు, నాకేమో అక్కడ ఉచ్చ పడిపోతున్నాయి,
ఇట్లా కాదు నేను దూరంగా నిలబడతాను, నువ్వు తియ్యి అంటాను.. ఏమ్కాదు నువ్వు దగ్గరగా నిలబడు అంటాడు.. చూడు వాలందరు దిగుతున్నారు అంటాడు..
నాకేమో వాలందరు ఆయనకీ పరిచయం ఉండవచు, లేకుంటే అంత మహానుబావునితో ఎలా అంత క్లోజ్ గా ఫోటో దిగాగలరు అనుకుంటాను..
కొంచం చెపు ఆయనని చూస్తూ అలా అలా సంతోస పడుతున్న సమయంలో, ఎందుకో సడన్గా నీకు మళ్ళి అవకాసం వస్తుంది అని గ్యారంటి లేదు సో ఇప్పుడే ఆయనతో ఫోటో దిగు, దిగు , దిగు అని నా మనసు గిచ్చింది..
సరే అని వాసుకి చెప్పి, నేను ఆయన పక్కకి వెళ్ళి నిలబడతాను నువ్వు ఫోటో తియ్యి అనిచెప్పా..
ఎవ్వరో ఫోటో దిగుతుంటే, నేను కూడా వెళ్లి నిలబడ్డా నేను నిలబడి, వాసు క్లిక్ చేసే లోపల వారు వెళ్ళిపోయారు...
ఇంతలో ఇంకెవ్వరో ఆయనతో ఫోటో దిగుతుంటే ఆయన అటు తిరిగారు, ఆయన అటు తిరిగిన పర్వాలేదు నువ్వు తియ్యి అని చెప్పి, ఫోటోకి ఫోసు ఇచ్చ..
వాళ్ళ ఫోటో అయ్యిపోయినట్టుంది, సడన్గా ఆయన ఇటు తిరిగారు, నోట్లోంచి మాట రావట్లేదు, సర్ అని ఫోటో అనే సైగమాత్రమే చేయగలిగా,,
అద్బుతం, అమోగం, ఆయనతో ఒక ఫోటో... ఆయన పక్కనే , మేము ఇద్దరము ఒకే ఫ్రేమ్ లో, టకా టకా తీసాడు, నేను థాంక్స్ అని ఆయనతో అన్నాను, ఆయన వెళ్ళిపోయారు అన్ని క్షణాలలో జరిగి పోయాయి..
నాలుగు ఫోటోలు తీసాడు వాసు, 2 మసగ్గా వచాయి, 2 పర్లేదు.. అట్లని మల్లి అడగగలమా.. అంత సీన్ లేదు కదా.. ఉన్న ఫొటోస్ తో సంతృప్తి పడ్డా!!
ధియేటర్ లో కూర్చున్న, కాని నా చూపులు అంతా వెనక్కే, ఆయన కూడా కూర్చుంటాడ లేదా అని .. మళ్ళి ఆనందం, ఆయన వచ్చి ఆయన సీట్లో కూర్చున్నారు, ఆయన కూర్చున్న ధియేటర్ లో కూర్చొని , ఆయన తీసిన సినిమా చూస్తున్న!!
సినిమాలో మంచి సీన్ కనిపిస్తే ఈల వేస్తాం, ఇప్పుడు నా ఈల ఎవ్వరికి వినపడాలని, ఎవ్వరిని ఉద్దేశించి వేస్తామో, ఆయన ఇక్కడే ఉన్నారు, నా ఈల ఆయనకీ వినబడుతుంది, మళ్ళి పట్టలేని ఆనందం..
అద్బుతం, అద్బుతమైన సన్నివేశాలు సినిమాలో పుష్కలంగా ఉన్నాయి, నేను ఈలతో ఆయనికి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను అని తెగ సంబరపడిపోయా...
ఇంటర్వెల్ పడగానే, ముందు ఆయన సీట్ వైపు చూసా, ఆయన అందరిలాగే నార్మల్ గా ఆయన సీట్ ఉన్నలైన్ లో నడుచుకుంటూ వెళ్తుంటే... ఆయన్ని అంత సింపుల్ గా చూస్తుంటే మళ్ళి సంతోషం..
ఇంటర్వెల్ లో కొంచం జనాబా టాయిలెట్స్ కి , తినటానికి , తాగటానికి వెళ్తుంటే , నాకు ఆయన్ని కొంచం ప్రసాంతంగా చూసుకునే వీలు దొరికింది..
ఆయన తల స్నానం చేసి వచ్చారు అనుకుంట, చాల ఫ్రెష్ గా అనిపిస్తున్నారు..
మొహం మరీ తెల్లగా, కళ్ళు కొంచం ఎర్రగా ఉన్నాయి, చాలా ఎనర్జీ టిక్ గా ఉన్నారు..
ఆయన్ని ఆలానే చూస్తూ ఉండిపోయా..
సినిమా అయ్యిన తర్వాతా.. మళ్ళి ఆయన వెళ్ళే వరకు అలానే చూస్తుండిపోయా..
నా అదృష్టం ఏంటంటే ఆయన మీద ఇతరులకు ఉన్న మోజిని, నాలాంటి వారికి ఆయన్ని మరీ దగ్గర చేసిన "వోడ్కా విత్ వర్మ" పుస్తక రచయిత, శత్య2 పాటల రచయిత సిరాశ్రీ గారి కలుసుకొనే అదృష్టం ఇదే షో లో రావటం.. ఆయన నేను ఉదయాన్న ఆయనికి tweet చేసిన శత్య2 tweets గురుంచి అడగటం మరి సంతోషాన్ని ఇచ్చింది .. ఆయనతో, భాస్కరబట్ల గారితో, రఘు కుంచె గారితో, నా గురువు నా సినిమా దేవుడిని కలుసుకొనే అదృష్టానికి కారకులైన మధుర శ్రీధర్ గారితో కొన్ని ఫోటోలు దిగాను!!
నా కోసం ఫొటోస్ తీసి, నా జ్ఞాపకాలను పదిల పరిచిన నా ఫ్రెండ్ వాసు కి నా కృతజ్ఞతలు...